Minister Ponnam Prabhakar says BC Castes Census in Telangana : కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ కుల గణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టారని, ఇప్పుడు ఆ హామీని అమలు చేసే బాధ్యత తాను తీసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. తెలంగాణ గౌడ సంఘం, పీసీసీ కల్లుగీత శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సమావేశ మందిరంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు.
కుల గణన(Caste Census) జరిగితేనే బీసీల లెక్కలు తేలుతాయని అప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు లభిస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. రెండు ప్రధాన పార్టీల నుంచి 8 మంది గౌడ కులస్థులు పోటీ చేస్తే అందులో నలుగురు గెలిచారని కాంగ్రెస్ పార్టీ నుంచి తానొక్కడినే గెలుపొందానని మంత్రి పేర్కొన్నారు. గౌడ కులస్థుల సమస్యలు పరిష్కారం కావాలంటే, తనని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని గౌడ కులస్థులపై ఉందని అన్నారు.
ప్రజాదర్బార్‌తో ప్రజల సమస్యల పరిష్కరాన్ని పూర్తిగా మార్చేశాం : పొన్నం ప్రభాకర్
"తప్పకుండా మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మన సంఘానికి సంబంధించిన ప్రతినిధుల అన్ని అంశాలకు సంబంధించి భవిష్యత్తులో ఎవరికైన ఇబ్బంది వస్తే నేను ఉన్నానని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇది ప్రజల పరిపాలన, ప్రజాబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు. ఇనుప కంచెల మధ్య బందీగా నిలిచిన ప్రగతిభవన్ కంచెలను తీసి నూతన ప్రభుత్వానికి శ్రీకారం చుట్టాం. ఆ భవన్‌ను జ్యోతీబాపూలే ప్రజాభవన్‌గా మార్చుకున్నాం. రెండు ప్రధాన పార్టీలు ఎనిమిది మందికి టికెట్లు ఇస్తే అందులో నలుగురు గెలిచారు. తప్పకుండా బలహీన వర్గాల అభివృద్ధి మా బాధ్యత. నేను చెప్పడం లేదు రాహుల్ గాంధీ చెప్పారు. కుల గణనను చేపడతామని. జూపల్లి కృష్ణారావు నిర్వహించే ఎక్సైజ్ శాఖను కూడా నేను చూసుకుంటానని చెప్పాను."- పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి
ఎక్సైజ్ శాఖ జూపల్లిది అయిన తానే బాధ్యతలు నిర్వర్తిస్తా : బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishnarao) అయినప్పటికీ ఆ శాఖను తానే నడుపుతానని సభలో ఉన్న వారిని ఉత్తేజపరిచారు. ఈ సభలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కల్లు గీత డిపార్టుమెంటు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రాజకీయాలకు అతీతంగా హుస్నాబాద్‌ను అభివృద్ధి చేస్తాం : పొన్నం ప్రభాకర్
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేయాలని కార్యకర్తలకు మంత్రి పొన్నం పిలుపు