Minister Ponnam Prabhakar on BC Bandhu Scheme :బీఆర్‌ఎస్ పార్టీ అమలు చేసిన బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దాని అమలుపై సమీక్ష నిర్వహించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో మీడియా సమావేశం తరువాత మంత్రి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖలపై సమీక్షలు చేయకుండా మాట్లాడడం సరియైనది కాదని అభిప్రాయపడ్డారు. సమీక్ష నిర్వహించి వాస్తవాలు తెలుసుకున్న తరువాతనే మీడియా ముందుకు వస్తానని వెల్లడించారు.
రాష్ట్రంలో బీసీ బంధు స్కీమ్ నిలిపివేత - మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన - BC Bandhu Scheme Discontinued in Telangana
Minister Ponnam Prabhakar on BC Bandhu Scheme : తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వాలు అమలు చేసిన కొన్ని పథకాలపై సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తీసుకొచ్చిన బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Published : Dec 10, 2023, 7:51 PM IST
BC Bandhu Scheme Discontinued in Telangana : బీసీ బంధు పూర్తి స్థాయిలో పారదర్శకంగా అర్హులకు చేరేట్లు తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం కాలేదన్న ఆయన ఉద్యోగులకు, ప్రజలకు ప్రయోజనం కలిగేలా తాము చర్యలు తీసుకుంటామని వివరించారు. రైతు బంధుపై బీఆర్‌ఎస్ నాయకులు అప్పుడే విమర్శలు చేయడాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. తాము అధికారం చేపట్టి రెండు రోజులకే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని, అందుకు నిదర్శనం అధికార పగ్గాలు చేపట్టిన రెండు రోజుల్లోనే రెండు హామీలు అమలు చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.