తన నివాసం నుంచి బయటకురాకుండా కట్టడి చేయాలని ఎస్‌ఈసీ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు శనివారమే ఆయన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని మంత్రి తరఫు న్యాయవాది కోరగా.. ఇవాళ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది.
ఎస్‌ఈసీ ఇచ్చిన ఆదేశాలతో.. రాష్ట్రపతి చిత్తూరు పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొనే అంశంపై సందిగ్ధత నెలకొంది. తాను జారీచేసిన నిషేధాజ్ఞలను... కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. రాష్ట్రపతి ఆహ్వానితుల జాబితాలో పెద్దిరెడ్డి ఉన్నందున తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.