ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం 24 గంటలు మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి ప్రారంభించిందని... కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. గాలిద్వారా కూడా ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రులు అనవసర ఆరోపణలు చేస్తున్నారు: కిషన్ రెడ్డి
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. రాష్ట్ర మంత్రులు అనవసరంగా కేంద్రంపై ఆరోపణలు చేసున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే కేసులు, మరణాలను బట్టి కేంద్రం కేటాయింపులు చేస్తోందని తెలిపారు.
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కిషన్‌రెడ్డి... బాధితులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ నిల్వలను పరిశీలించారు. గాంధీలో ఆక్సిజన్ కొరత లేదన్న ఆయన... ఈ ఆస్పత్రికి వ్యాక్సిన్ డోసులను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర మంత్రులు అనవసరంగా కేంద్రంపై ఆరోపణలు చేసున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే కేసులు, మరణాలను బట్టి కేంద్రం కేటాయింపులు చేస్తోందని తెలిపారు. తెలిపారు.
ఇదీ చదవండి:వైద్య, ఆరోగ్యశాఖకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు