ఇటీవల నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే ప్రజామోదం పొందిన నాయకుల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి స్థానంలో నిలవడం సంతోషంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. భారతదేశాన్ని సమర్థవంతంగా పాలించడమే కాకుండా.. ప్రపంచ దేశాల ముందు భారతదేశం గర్వించే స్థాయికి తీసుకెళ్లడం ఒక నరేంద్ర మోదీకే సాధ్యమవుతుందన్నారు.
దేశం గర్వించేలా చేయడం మోదీకే సాధ్యం: కిషన్ రెడ్డి - హైదరాబాద్ లేటెస్ట్ వార్తలు
భారతదేశాన్ని సమర్థవంతంగా పాలించడమే కాకుండా.. ప్రపంచ దేశాల ముందు భారతదేశం గర్వించే స్థాయికి తీసుకెళ్లడం ఒక నరేంద్రమోదీకే సాధ్యమవుతుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో ప్రధాని సమర్థవంతంగా పని చేశారని చెప్పారు.

దేశం గర్వించేలా చేయడం మోదీకే సాధ్యం: కిషన్ రెడ్డి
ప్రపంచంలో 74 శాతం ప్రజల మద్దతు మోదీకి ఉందని... బ్రెజిల్ ప్రధానికి 46 శాతం, అమెరికా అధ్యక్షుడికి 40 శాతం, యూకే ప్రధానికి 39 శాతం మద్దతు ఉందన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో ప్రధాని సమర్థవంతంగా పని చేశారని తెలిపారు. తెలుగు ప్రజల తరఫున ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో తెలుగు ప్రజలు మోదీ అండగా నిలిచి ఆశీర్వాదించాలని కోరారు.
ఇదీ చదవండి:పాఠశాలలు ప్రారంభించాలని మంత్రికి వినతి