జీహెచ్ఎంసీలో తెరాస హామీలపై రేపు ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ ఛార్జ్‌షీట్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ విడుదల చేస్తారని తెలిపారు.
జీహెచ్ఎంసీలో తెరాస హామీలపై రేపు ఛార్జ్‌షీట్ విడుదల: కిషన్ రెడ్డి
గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీలు అమలు కాలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపు ఉదయం తెరాస హామీలపై ఛార్జ్‌షీట్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఛార్జ్‌షీట్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ విడుదల చేస్తారని తెలిపారు.
జీహెచ్ఎంసీలో తెరాస హామీలపై రేపు ఛార్జిషీట్ విడుదల: కిషన్ రెడ్డి
అనంతరం ఆ ఛార్జ్‌షీట్ పత్రాలను ఖైరతాబాద్ నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ డివిజన్లో ఇంటింటికి పంపిణీ చేస్తామని చెప్పారు. తెరాస ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. నగరంలో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వరదల సమయంలో తీవ్రమైన అవస్థలు పడ్డారని తెలిపారు.
ఇదీ చదవండి:స్వామి గౌడ్‌ను కలిసిన బండి సంజయ్, లక్ష్మణ్