నెదర్లాండ్స్ రాజధాని హేగ్ నగరంలోని పెట్టుబడిదారుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయం, విత్తన రంగంలో తెలంగణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పారిశ్రామిక విధానంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి వివరించారు. డచ్ ట్రేడ్ మిషన్ సభ్యులను తెలంగాణను సందర్శించాల్సిందిగా ఆహ్వానం పలికారు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాంలో 128 ఎకరాల్లో ఉన్న 3వ అతిపెద్ద పూలవేలం భవనంను సందర్శించారు.
వేరుశనగపై ఆసక్తి
నెదర్లాండ్‌లో పెట్టుబడిదారుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి - latest news of agri minister in investors meet in Nederland
నెదర్లాండ్ రాజధాని హేగ్ నగరంలో ఏర్పాటు చేసిన పెట్టుబడి దారుల సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. వ్యవసాయం, విత్తన రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి డచ్ ట్రేడ్ మిషన్ సభ్యులకు ఆహ్వానం పలికారు.
నెదర్లాండ్‌లో పెట్టుబడిదారుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి
అధిక దిగుబడినిచ్చే వేరుశనగ సాగుకు సహకారం అందిస్తామని డచ్ ట్రేడ్ మిషన్ హామీ ఇచ్చింది. గత నెలలో 14 నుంచి 18వ తేదీ వరకు కింగ్ విలియం అలెగ్జాండర్ అధ్యక్షతన ఆహారం, వ్యవసాయం అంశాలపై 250 మంది ఆ దేశ ప్రతినిధులు భారత్‌లో పర్యటించి పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపారు.
ఇదీ చూడండి: ముగిసిన డెడ్‌లైన్... తర్వాత ఏం జరగనుందో..?
TAGGED:
పెట్టుబడిదారుల సమావేశం