తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీ దవాఖానాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్​ - సుల్తాన్​ నగర్​లో బస్తీ దవాఖానా ప్రారంభం

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 45 బస్తీ దవాఖానాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఎర్రగడ్డలోని సుల్తాన్ నగర్, యాదగిరి నగర్​లోని బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

KTR inaugurated Basti Dawakhana in Erragadda
బస్తీ దవాఖానాను ప్రారంభించిన కేటీఆర్​

By

Published : May 22, 2020, 1:41 PM IST

Updated : May 22, 2020, 4:32 PM IST

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో మరో 45 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. ఎర్రగడ్డ లోని సుల్తాన్ నగర్, యాదగిరి నగర్​లో బస్తీ దవాఖానాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రోగుల కోసం ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన సదుపాయాల గురించి దవాఖానా సిబ్బందితో మంత్రి చర్చించారు. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, ఎమ్మెల్యే గోపీనాథ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్ధిన్, వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొన్నారు.

నిబంధనలు పాటించని వారికి జరిమానా

సుల్తాన్​నగర్​లో బస్తీ దవాఖానా ప్రారంభం సందర్భంగా... అనుమతి లేకుండా ఆస్పత్రి పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఎర్రగడ్డ కార్పొరేటర్ షాహిన్ బేగంకు 20,000 రూపాయలు జరిమానా విధించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఎర్రగడ్డ కార్పొరేటర్ భర్త షరీఫ్ మాస్కు లేకుండా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు వెయ్యి రూపాయల జరిమానా విధించాలని మంత్రి పేర్కొన్నారు.

బస్తీ దవాఖానాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

ఇదీ చదవండి:వలస కష్టం: మండుటెండలో గర్భిణి నడక

Last Updated : May 22, 2020, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details