తెలంగాణ

telangana

ETV Bharat / state

Niranjanreddy Review on Telangana Decade Celebrations : 'దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలి' - దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నిరంజన్‌రెడ్డి సమీక్ష

Niranjanreddy Video Conference on Telangana Decade Celebrations : జూన్ 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు వేదికలను సుందరంగా ముస్తాబు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సచివాయంలో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Niranjanreddy
Niranjanreddy

By

Published : May 29, 2023, 7:38 PM IST

Niranjanreddy Video Conference on Telangana Decade Celebrations : వ్యవసాయ రంగానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యత ఉంటుందని.. దశాబ్ది ఉత్సవాలు వ్యవసాయ శాఖతో ప్రారంభం కావడం గర్వకారణమని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. భవిష్యత్‌లోనూ వ్యవసాయ రంగానికే పెద్దపీట వేస్తామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో వ్యవసాయ శాఖలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు.

Niranjanreddy Review with Agricultral Officials : ప్రభుత్వం వ్యవసాయం, రైతులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దశాబ్ది ఉత్సవాల్లో తెలియజెప్పాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులకు సూచించారు. వ్యవసాయ శాఖ తరఫున జరిగే దశాబ్ది ఉత్సవాలు చారిత్రక జ్ఞాపకంగా మిగిలిపోవాలంటే వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యోగులు ఈ కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. మార్కెట్ యార్డులను మామిడి తోరణాలు, విద్యుత్తు దీపాలతో అలంకరించి రైతులతో సమావేశాలు నిర్వహించాలని నిర్దేశించారు. ఉత్తమ, నాణ్యమైన పంటలు పండించే ఉత్తమ రైతులను గుర్తించి సత్కరించాలని తెలిపారు. జూన్ 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతువేదికలు సుందరంగా ముస్తాబు చేయాలని ఆదేశించారు.

Telangana Decade Celebrations Schedule : దశాబ్ది వేడుకల షెడ్యూల్​ను ప్రకటించిన కేసీఆర్

రాష్ట్రంలో వ్యవసాయ శాఖ సాధించిన విజయాలు తెలియపరుస్తూ పెద్దఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు... రైతులకు అవి అర్ధమయ్యేలా సమావేశాలలో మట్లాడే ప్రసంగాల్లో వివరించి, కరపత్రాలు అందజేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు వేదికల్లో పండుగ వాతావరణం కనిపించాలన్న నిరంజన్‌రెడ్డి... వ్యవసాయ మార్కెట్ యార్డులు విద్యుత్ కాంతుల్లో ధగధగ మెరవాలని అధికారులను ఆదేశించారు. ఆయా మార్కెట్ల పరిధిలో ఉత్తమ, నాణ్యమైన పంటలు పండించే ఉత్తమ రైతులను గుర్తించి సత్కరించాలని మంత్రి తెలిపారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ముస్తాబు చేసి ఉత్సవాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి జరిగిన మేలు యావత్ రైతాంగానికి వివరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హనుమంతు, మార్కెటింగ్ శాఖ సంచాకులు లక్ష్మీభాయి, అన్ని జిల్లాల డీఏఓలు పాల్గొన్నారు.

ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమయిన అధికారులు :ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం ఎన్ని ఏర్పాట్లను చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖల అధికారులతో సమీక్షలు జరిపి.. ఉత్సవాల నిర్వహణకు నిధులు కేటాయించారు. అలాగే అన్ని జిల్లాల కలెక్టరు, ఎస్పీలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పండగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details