రసాయనిక ఎరువుల కొరత ఉత్పన్నం కాకుండా కొత్త రేక్పాయింట్లు మంజూరు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర రైల్వేశాఖ మంత్రికి లేఖ రాశారు. పాతవి రెండు మణుగూరు, జహీరాబాద్ రేక్ పాయింట్లు పునరుద్ధరించాలని లేఖలో మంత్రి పేర్కొన్నారు. అక్కన్నపేట్, బాసర, నల్గొండ, బీబీనగర్, మహబూబాబాద్, ఉప్పల్, కొత్తగూడెం, వికారాబాద్, మదనాపురం, వికారాబాద్‌లో కొత్త రేక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సాధారణంగా వర్షాలు కురుస్తున్నప్పుడు, ఖరీఫ్, రబీ సమయంలో డిమాండ్ ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న రేక్ పాయింట్ల నుంచి రైతులకు ఎరువులు సరఫరా చేయడం ఇబ్బంది అవుతోందన్నారు.
రైల్వే శాఖ మంత్రికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ - రైల్వే శాఖ మంత్రికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ
రైతుల సౌకర్యార్థం తెలంగాణకు కొత్త రేక్పాయింట్లు మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కి లేఖ రాశారు. భవిష్యత్తులో రసాయన ఎరువుల కొరత ఉత్పన్నం కాకుండా ఉండేందుకు తమ విజ్ఞప్తిని పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.

రైల్వే శాఖ మంత్రికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ
నూతన రేక్ పాయింట్లు ఏర్పాటు చేయడం వల్ల రవాణా ఛార్జీలు ఆదా అవుతాయన్నారు. నూతన సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడం తెలంగాణలో సాగు పెరిగిందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో సాగుచేసే విస్తీర్ణం మరింత పెరుగుతుందని తెలిపారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా రాష్ట్రానికి వెంటనే కొత్త రేక్ పాయింట్లకు అనుమతి ఇవ్వాలని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : నేడు హుజూర్‌నగర్‌కు గులాబీ సైన్యం
Last Updated : Sep 27, 2019, 7:59 AM IST