తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముఖ్యమంత్రి ఆశయాలకు బడ్జెట్​ అద్దం పడుతోంది' - కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపిన నిరంజన్​ రెడ్డి

సీఎం కేసీఆర్‌ ఆశయం, ఆకాంక్ష, లక్ష్యం, చిత్తశుద్ధి, పట్టుదలకు రాష్ట్ర బడ్జెట్‌ అద్దంపడుతోందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఇది రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపితమైందని సంతోషం వ్యక్తం చేశారు.

minister niranjan reddy thanks to CM KCR
ముఖ్యమంత్రి ఆశయాలకు బడ్జెట్​ అద్దంపడుతోంది

By

Published : Mar 8, 2020, 5:26 PM IST

రాష్ట్ర బడ్జెట్‌లో అగ్రభాగం వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించడం సంతోషకరమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు పథకం కింద లబ్ధిదారులు పెరిగిన నేపథ్యంలో గతంలో కేటాయించిన నిధులకు అదనంగా మరికొన్ని నిధులు కేటాయించడం హర్షణీయమన్నారు.

రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు కుటుంబాల్లో ధీమాను పెంచే రైతు బీమా పథకానికి రూ.1,141 కోట్ల కేటాయింపులు చేశారని తెలిపారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక రైతువేదిక నిర్మాణంతో పాటు ప్రతి రైతు వేదికకు రూ.12 లక్షలు కేటాయిస్తూ రూ.350 కోట్లు కేటాయించారని మంత్రి వివరించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెద్దపీటవేసి కేటాయింపులు ప్రతిపాదించిన ముఖ్యమంత్రి కేసీఆర్​కు, ఆర్థికమంత్రి హరీశ్​రావుకు రైతుల పక్షాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి:తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

ABOUT THE AUTHOR

...view details