తెలంగాణ

telangana

ETV Bharat / state

త్వరలోనే రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పరిశోధనా కేంద్రం: నిరంజన్‌రెడ్డి - minister niranjan reddy speech

minister niranjan reddy on oil form: రాష్ట్రంలో 1100 ఎకరాల్లో ఆయిల్‌పామ్ నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి నిరంజ‌న్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు.

minister-niranjan-reddy-talk-about-oil-form-cultivation-in-assembly-sessions-2022
ఆయిల్ పామ్ సాగుపై నిరంజన్‌రెడ్డి ప్రసంగం

By

Published : Mar 14, 2022, 12:16 PM IST

minister niranjan reddy on oil form

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని... మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగుపై... సభ్యులు అడిగిన పలు రకాల ప్రశ్నలకు... మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 1100 ఎకరాల్లో ఆయిల్‌పామ్ నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.

వానాకాలంలో 2.20 లక్షల ఎకరాలకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు కేంద్రం రూ.6 వేలు మాత్రమే ఇస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై రూ.14 వేలకు పైగా భారం పడుతోందని స్పష్టం చేశారు. ఆయిల్‌పామ్ ఎక్కువ సాగు చేసే వారికి రాయితీపై ఆలోచిస్తామన్నారు. 14-16 నెలల మొక్కలను రైతులకు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. రైతులు ఒక్కో మొక్కకు రూ.17 చెల్లించాలని చెప్పారు. రైతువేదికల కోసం అద్భుతమైన సిలబస్ సిద్ధం చేశామని వివరించారు. ఆర్వోఎఫ్​ఓ భూముల్లోనూ ఆయిల్‌పామ్ సాగుకు అనుమతి ఇస్తామన్నారు.


''రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్స‌హిస్తున్నాం. కేంద్ర ప్ర‌భుత్వం మన రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు నిమిత్త‌మై 10 ల‌క్ష‌ల 90 వేల ఎక‌రాల‌ను అనువైన ప్రాంతంగా సూచించింది. పంట మార్పిడి విధానంలో భాగంగా భారీ స్థాయిలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం. కేంద్రం సూచించిన దానితో పాటు అద‌నంగా 20 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఈ సాగును విస్త‌రించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రాష్ట్రంలో ఆయిల్ పామ్ న‌ర్స‌రీలు, ఆయిల్ ఎక్స్‌ట్రాక్ష‌న్ ఫ్యాక్ట‌రీల ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. ఆయిల్ పామ్ సాగు నిమిత్తం రైతుల్లో చైత‌న్యం పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం.''

- నిరంజన్‌ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

ఆయిల్ పామ్ సాగుపై నిరంజన్‌రెడ్డి ప్రసంగం

ఇదీ చదవండి:Special Grants to Telangana : కేంద్రంపై తెలంగాణ ఆశ.. నిధులు అందక నిరాశ

ABOUT THE AUTHOR

...view details