తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుబంధు లబ్దిదారుల్లో 5 ఎకరాలు ఉన్నవారే 92.50 శాతం'

minister-niranjan-reddy-says-rythu-bandhu-scheme-is-applicable-only-to-those-under-10-acres
'10 ఎకరాలలోపు ఉన్నావారికే రైతుబంధు వర్తింపు'

By

Published : Jun 29, 2022, 1:24 PM IST

Updated : Jun 29, 2022, 2:55 PM IST

13:20 June 29

'రైతుబంధు లబ్దిదారుల్లో 5 ఎకరాలు ఉన్నవారే 92.50 శాతం'

Rythu bandhu beneficiaries: రైతుబంధు లబ్దిదారుల్లో 5 ఎకరాలు ఉన్నవారే 92.50 శాతం మంది ఉన్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి స్పష్టం చేశారు. 1.50 కోట్లు మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామన్నారు. 92 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని వెల్లడించారు. 2 రోజుల్లో 36.30 లక్షల రైతులకు రైతు బంధు నిధులు జమ అవుతాయని హామీనిచ్చారు. గత 8 విడతల్లో రూ.50,448 కో‌ట్లు రైతు బంధు నిధులు ఇచ్చామని తెలిపారు. 65 లక్షల మంది రైతులకు రూ.7508 కోట్లు అందనున్నాయన్నారు. 68 లక్షల మందిరైతులకు రైతుబంధు వస్తుందని వివరించారు.

"రైతుబంధు స్వీకరిస్తున్న అన్నదాతలకు శుభాకాంక్షలు. ఇవాళ రెండెకరాలలోపు ఉన్న 16.32 లక్షల మందికి రైతుబంధు సాయం జమ చేస్తున్నాం. 24.68 లక్షల ఎకరాలకు 1234 కోట్ల రూపాయలు జమ కానున్నాయి. ఈ రెండ్రోజుల్లో ఎకరా, రెండెకరాలు ఉన్నవారికి రూ.1820.75 కోట్లు జమ అవుతున్నాయి. రెండు రోజుల్లో మొత్తం 36.41 లక్షల ఎకరాలకు సాయం అందుతోంది. ఈ ఏడాది వానా కాలంలో 68.10 లక్షల మంది అన్నదాతలు రైతుబంధుకు అర్హులుగా ఉన్నారు." - నిరంజన్​రెడ్డి, మంత్రి

2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ సర్కారు రైతులను మోసం చేసిందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రసాయన ఎరువులు, పెట్రోల్, డీజిల్, యాంత్రీకరణ ధరలు పెంచి రైతులపై భారం మోపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేళ్లల్లో రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ.3.65 లక్షల కోటపలు కేంద్రానికి వెళ్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.68 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. 75 ఇళ్లల్లో ఇంత దుష్టరాజకీయాలు చూడలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాలను భాజపా కూల్చేస్తుందని ఆరోపించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో తాము ప్రధాని మోదీని కలవబోమని తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా రైతుబంధు అమలు చేస్తామని భాజపా సమావేశాల్లో తీర్మానం చేయాలని నిరంజన్ రెడ్డి డిమాండ్​ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు సీ2+50 ప్రకారం గిట్టుబాటు ధరలు నిర్ణయించాలన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని.. అన్ని రకాల వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధరలు చట్టబద్ధం చేయాలని కోరారు. ఆ మేరకు కేంద్రం ప్రభుత్వమే పంటల కొనుగోలు ప్రక్రియ చేపట్టాలన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ పంపు సెట్లకు మీటర్లు బిగించబోమని హైదరాబాద్ వేదికగా జరిగే భాజపా డిక్లరేషన్​లో ప్రకటించాలని నిరంజన్​రెడ్డి డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి :పాసవలేదని ప్రాణం తీసుకున్నారు..

Last Updated : Jun 29, 2022, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details