రైతులు పంటలను అమ్ముకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. మార్కెట్ల నియంత్రణ జరగాల్సిన అవసరముందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అవసరమైన మేర మక్కల నిల్వలు ఉన్నాయన్నారు.
అలాగే వానాకాలంలో రైతులకు ప్రత్యామ్నాయాలు చూపిస్తున్నామని మంత్రి వెల్లడించారు. పంటలు, సాగునీటి లభ్యత తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని.. ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న నిరంజన్‌రెడ్డి.. రైతుబంధుకు అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో నగదు జమ అవుతుందని స్పష్టం చేశారు.