రాష్ట్రంలో రుణమాఫీ అమలులో భాగంగా ఇవాళ తొలిరోజు 1,309 మంది రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధుల బదిలీ చేశామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. 25 వేల నుంచి 25,100 రూపాయల వరకు వ్యవసాయ రుణాలు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలకు ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. మొత్తం 3,27,91,000 రూపాయలను 186 ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్న దృష్ట్యా... 50 వేల రూపాయలలోపు రైతుల పంట రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు.
రుణమాఫీ ట్రయల్ రన్ విజయవంతం: మంత్రి నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో రుణ మాఫీ ట్రయల్ రన్ విజయవంతమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని 25 వేల నుంచి 25,100 రూపాయల వరకు వ్యవసాయ రుణాలు ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలకు ట్రయల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు.
Debt waiver
రైతుబంధు పథకం కింద నిధుల పంపిణీ మాదిరిగానే రుణమాఫీ నిధులూ జమ అవుతాయని తెలిపారు. రైతుల ఖాతాల్లో జమైన నిధులు బ్యాంకర్లు ఇతర పద్దుల కింద తీసుకోవద్దని సూచించారు. వ్యవసాయ పంట రుణాలు మాఫీ అయిన రైతులకు తక్షణమే.. బ్యాంకులు కొత్త రుణాలు అందజేయాలని మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు.
ఇదీ చూడండి:Loan Waiver : రాష్ట్రంలో నేటి నుంచి రెండో దఫా రుణమాఫీ