ఆయిల్‌పామ్ విత్తన మొలకల దిగుమతి సుంకాన్ని రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 30 నుంచి 5 శాతానికి తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి నిరంజన్‌రెడ్డి (minister niranjan reddy) కృతజ్ఞతలు తెలిపారు. ఆయిల్‌పామ్ సాగు పెంచేందుకు చేపట్టిన చర్యలపై కంపెనీల ప్రతినిధులతో ఆయన (minister niranjan reddy ) సమీక్షించారు. ఆయిల్‌పామ్ సాగు, విస్తీర్ణం పెంపు చర్యలు, పురోగతి తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆయిల్‌పామ్ ప్రాజెక్టు పేరిట రాబోయే నాలుగేళ్లల్లో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికలు అమల్లో పెట్టాలని మంత్రి (minister niranjan reddy) సూచించారు.
ఆయిల్‌పామ్ మొక్కల లభ్యత, నాణ్యత పరిశీలన కోసం త్వరలోనే నర్సరీలను సందర్శించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి (minister niranjan reddy) ఆదేశించారు. కేటాయించిన జిల్లాల్లో పామాయిల్ ఫ్యాక్టరీల నిర్మాణానికి చర్యలు చేపడితే.. రైతులకు నమ్మకం కలుగుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయిల్‌పామ్ క్షేత్రాల సందర్శనకు జిల్లాల వారీగా రైతులను తీసుకెళ్లాలని సూచించారు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పంటసాగుపై అరగంట నిడివి గల డాక్యుమెంటరీ రూపొందించాలని ఆయిల్‌ఫెడ్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి (minister niranjan reddy) ఆదేశించారు.
రైతులకు రుణాలు
దేశంలో 138 కోట్ల జనాభా అవసరాల కోసం ఏటా 22 మిలియన్ టన్నుల నూనె అవసరం ఉన్నప్పటికీ... 7 మిలియన్ టన్నుల నూనె గింజలు ఉత్పత్తి మాత్రమే సామర్థ్యం ఉంది. లోటు భర్తీ చేయడానికి ముడి వంట నూనెలు మలేషియా, ఇండోనేషియా లాంటి చిన్న దేశాల నుంచి దిగుమతి చేయాల్సి వస్తుంది. అందుకోసం పెద్ద ఎత్తున సంపద వెచ్చిస్తున్న నేపథ్యంలో స్వయం సంవృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వులు, కుసుమ, వేరుశనగ తదితర నూనెగింజల సాగు ప్రోత్సహించాలని నిర్ణయించాయి. తెలంగాణలో పండే ఆయిల్‌పామ్ గెలల్లో అధిక నూనె శాతం ఉన్నట్లు పరిశోధనా సంస్థలు తేల్చిచెప్పాయి. ఈ పంట సాగు చేసే రైతాంగానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గుంతల తవ్వకం, సూక్ష్మ సేద్యం కింద కింద బిందు సేద్యం పరికరాలు అవసరమైన రైతులకు సమీప బ్యాంకులను టై అప్ చేసి రుణాలు ఇప్పించే ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది.