రైతులకు ఎరువులను సకాలంలో అందించాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.. అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని హాకాభవన్‌లో వానాకాలం సన్నద్ధతపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. కేంద్రం నుంచి ఎరువుల కేటాయింపు, సరఫరా వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఎరువులను ప్రతి నెలా డ్రా చేసి సకాలంలో సరఫరా చేయాలని సూచించారు.
కేంద్రం కేటాయించిన ఎరువులను ప్రతి నెలా డ్రా చేయాలి: నిరంజన్ - minister niranjan reddy latest news
వానాకాలం సన్నద్ధతపై అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎరువుల కేటాయింపు, సరఫరా వంటి అంశాలపై చర్చించిన ఆయన.. ఎరువుల నిల్వల కోసం గోదాములు వినియోగించుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ దృష్ట్యా లోడింగ్, అన్‌లోడింగ్ సమస్యలు తలెత్తకుండా రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పారు.
మార్క్‌ఫెడ్ వద్ద 4లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఎప్పుడూ సిద్ధంగా ఉంచుతున్నామని తెలిపిన ఆయన.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఆ మేరకు ఎరువులు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎరువుల నిల్వల కోసం అందుబాటులో ఉన్న గోదాములు వినియోగించుకోవాలని సూచించారు. వానాకాలం రాక ముందే రైల్వేరేక్ పాయింట్ల నుంచి డిమాండ్‌కు అనుగుణంగా అన్ని జిల్లాలకు ఎరువులు పంపించాలని చెప్పారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో లోడింగ్, అన్‌లోడింగ్ సమస్యలు తలెత్తకుండా అధికారులు, ఎరువులు కంపెనీ యాజమాన్యాలు దృష్టి సారించాలని నిరంజన్‌రెడ్డి సూచించారు.
ఇదీ చదవండి:కొవిడ్ టీకాల సరఫరాకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం