Rythu bandhu Scheme : రాష్ట్రంలో రేపట్నుంచి ఈ ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం నిధులు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఏడు విడతల్లో 43,036.63 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని తెలిపారు. ఈ సీజన్‌తో కలుపుకుని మొత్తం 50 వేల కోట్ల రూపాయలు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ చేయడం పూర్తవుతోందని చెప్పారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. డిసెంబరు 10 నాటికి ధరణి పోర్టల్‌లో పట్టాదారులు, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అందిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాదారులు, అర్హులు రైతుబంధు పథకం కింద లబ్ధి పొందడానికి అర్హులని ప్రకటించారు.
ఈ సీజన్‌లో రూ.7645.66 కోట్లు