తెలంగాణ

telangana

ETV Bharat / state

బోయిన్​పల్లి మార్కెట్​ను విస్తరించాల్సిన అవసరం ఉంది: నిరంజన్​రెడ్డి - MSP NEWS

సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్‌ను మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌పై సమీక్ష నిర్వహించారు.

బోయిన్​పల్లి మార్కెట్​ను విస్తరించాల్సిన అవసరం ఉంది: నిరంజన్​రెడ్డి

By

Published : Oct 23, 2019, 5:27 PM IST

హైదరాబాద్​ నగర నలుమూలలా మార్కెట్​ల నిర్వహణకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులనువ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ఆదేశించారు. నూతన మార్కెట్ల ఏర్పాటుతో ప్రజలకు అందుబాటులోకి రావడమే కాకుండా రైతులకు కూడా ఇబ్బందులు తగ్గుతాయని మంత్రి పేర్కొన్నారు. బోయిన్​పల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీని సందర్శించిన మంత్రి నిరంజన్ రెడ్డి అక్కడే ఉన్న కూరగాయాల మార్కెట్‌ను పరిశీలించారు. అనంతరం 2019-20 ఖరీఫ్‌ మార్కెటింగ్ సీజన్‌పై అధికారులతో సమీక్షించారు.

ఖరీఫ్‌ సీజన్‌ ముగిసిన నేపథ్యంలో వ్యవసాయోత్పత్తులు మార్కెట్లకు వస్తున్నందున... గిట్టుబాటు ధరల కల్పన, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. బోయిన్​పల్లి మార్కెట్‌ 13 రాష్ట్రాలకు కూరగాయాల అమ్మకానికి ప్రధానమైందని.. నగరానికి రోజుకు దాదాపు నాలుగు వేల మెట్రిక్ టన్నుల కూరగాయాలు వస్తే... ఒక్క బోయిన్​పల్లి మార్కెట్‌కే 1500 నుంచి 2వేల మెట్రిక్ టన్నుల కూరగాయాలు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. మార్కెట్ పక్కన ఉన్న స్థలం లీజుకు లేదా ప్రత్యామ్నాయ స్థలం అప్పగించే ప్రతిపాదనపై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టాలని సూచించారు. రైతులు, వినియోగదారుల సౌలభ్యం దృష్ట్యా బోయిన్​పల్లి మార్కెట్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్‌లో వచ్చే చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే బయోగ్యాస్ ప్లాంట్‌ పరిశీలన... మరింత విస్తరించాలని అధికారులకు సూచించారు. మార్కెట్‌లో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టాలన్నారు.

బోయిన్​పల్లి మార్కెట్​ను విస్తరించాల్సిన అవసరం ఉంది: నిరంజన్​రెడ్డి

ఈ కథనం చదవండి: నేరాలు-ఘోరాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 8.2 శాతం

ABOUT THE AUTHOR

...view details