గ్లోబల్ సీడ్ హబ్ దిశగా తెలంగాణ అడుగులు వేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజా హోటల్లో జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. ఈ నెల 26 నుంచి జులై 3 వరకు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ విత్తన పరీక్షా అసోసియేషన్ ఇస్టా కాంగ్రెస్ - 2019 సమావేశం జరగనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమీషనర్ రాహుల్ బొజ్జ, తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ, విత్తన ధృవీకరణ సంస్థ ఎండీ డాక్టర్ కె.కేశవులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 32వ అంతర్జాతీయ విత్తన సదస్సు కోసం మాదాపూర్ హెచ్‌ఐసీసీలో పూర్తైన ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. ప్రారంభ వేడుకలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా జరుగుతాయని వెల్లడించారు. ముగింపు వేడుకలకు గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నట్లు స్పష్టం చేశారు.
విత్తనాభివృద్ధిలో అగ్రగామిగా ఎదగాలి: నిరంజన్ రెడ్డి - సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా తెలంగాణ ఎదగాలి
ప్రపంచంలోనే విత్తనాభివృద్ధిలో తెలంగాణ అగ్రగామిగా ఉండేలా కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ నెల 26 నుంచి జులై 3 వరకు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ విత్తన పరీక్షా అసోసియేషన్ ఇస్టా కాంగ్రెస్ - 2019 సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఏర్పాట్లపై అధికారులతో మంత్రి ఆరా తీశారు.

సీడ్ బౌల్ ఆఫ్ వరల్డ్‌గా తెలంగాణ ఎదగాలి
TAGGED:
Ista_Congress