విత్తన ఎగుమతులకు సహకారం
అంతర్జాతీయ విత్తన సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు - వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి
అంతర్జాతీయ విత్తన సదస్సుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 26 నుంచి జూలై 3 వరకు అంతర్జాతీయ విత్తన సదస్సును నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి విత్తన ఎగుమతులను సులభతరం చేయడానికి సహకరిస్తామని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సదస్సులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.జూన్ 24, 25 తేదీల్లోవిత్తనోత్పత్తిపై ఆఫ్రికన్ సదస్సు, జూన్ 27నవిత్తన రైతుల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. విత్తన ఎగ్జిబిషన్‌ను జూన్ 26, 27 తేదీల్లో, సాంకేతిక కమిటీ సమావేశాలు జూన్ 29 నుంచి జూలై 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఇదీ చూడండి : సంక్షోభం నుంచి దృష్టి మళ్లించేందుకే 'గ్రామ వాస్తవ్య'