కందుల కొనుగోలు కోటాను పెంచాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 2 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల కందుల దిగుబడి వచ్చే అవకాశముందన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున కేంద్రానికి లేఖ రాశారు. 47.5 వేల మెట్రిక్ అదనంగా మరో 56 వేల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోళ్లకు అవకాశం కల్పించాలన్నారు.
రైతులు ఇబ్బందులు పడొద్దు
రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. సహకారశాఖ కమిషనర్, ఉద్యానశాఖ కమిషనర్, మార్క్‌ఫెడ్ ఎండీ, మార్కెటింగ్ డైరెక్టర్, ఆయిల్‌ఫెడ్ ఛైర్మన్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డితో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ మొక్కలు అందుబాటులో ఉంచి సాగు చేయాలనుకుంటున్న రైతులను ప్రోత్సహించాలని సూచించారు. యూరియా పంపిణీలో జాప్యం ఉండొద్దని అధికారులకు ఆదేశించారు. కోహెడ మార్కెట్‌ను పరిశీలించి అభివృద్ధికి తగు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
కందుల కొనుగోలు పెంచాలని కేంద్రానికి మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ ఇవీ చూడండి:మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం