వర్షాకాలం సీజన్ ప్రారంభం కాబోతున్నందున నకిలీ విత్తనాలు అరికట్టాలని మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) అన్నారు. పకడ్బందీ చర్యలు తీసుకోవడం వల్ల ఈ తరహా నేరగాళ్లను కట్టడి చేయవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై మంత్రి నిరంజన్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితరులు వివిధ జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో దృశ్య మాధ్యమ సమీక్షలో మాట్లాడారు.
Niranjan reddy: నకిలీ విత్తనాలు అరికట్టాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచన - తెలంగాణ వ్యవసాయ వార్తలు
నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై రాచకొండ పోలీసులు తీసుకుంటున్న చర్యలను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి (Niranjan reddy) అభినందించారు. నకిలీ విత్తనాలు విక్రయించే పది మంది నేరగాళ్లపై పోలీసులు పీడీ చట్టం ప్రయోగించి జైలుకు తరలించారు.
Minister
ఈ విషయంలో రాచకొండ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాన్ని పూర్తిగా అరికట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి:Telangana: ఏడేళ్లలో తెలంగాణ మాగాణమైంది!