రైతులు పంటల ఉత్పత్తి, ఉత్పాదకతతో పాటు మార్కెటింగ్‌పైనా ప్రత్యేక దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. నల్గొండ జిల్లా కట్టంగూర్ రైతు పంటల ఉత్పత్తిదారుల సంఘం- ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంచార కూరగాయల మార్కెట్‌ను ఆయన ప్రారంభించారు.
రైతులు పంట మార్కెటింగ్‌పైనా దృష్టిసారించాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి - సంచార కూరగాయల మార్కెట్ వార్తలు
నల్గొండ జిల్లా కట్టంగూర్ రైతు పంటల ఉత్పత్తిదారుల సంఘం-ఎఫ్‌పీఓ ఆధ్వర్యంలో మంత్రి నిరంజన్ రెడ్డి.. సంచార కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. రైతులు పంట మార్కెటింగ్‌పైనా దృష్టి సారించాలని సూచించారు.
నల్గొండ జిల్లాలో రైతులు పండించిన పండ్లు, కూరగాయలు సేకరించిన హైదరాబాద్, ఇతర ప్రధాన పట్టణాల్లో నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు ఉద్దేశించిన ఈ ఎఫ్‌పీఓ ఏర్పాటుకు చొరవ తీసుకున్న మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డిని మంత్రి అభినందించారు. ఇది ఒక వినూత్న ఆలోచన అని కితాబు ఇచ్చారు. సాధారణ మండీల్లో పంట అమ్ముకోవాలంటే అనధికారికంగా 10 శాతం కమీషన్ చెల్లించాల్సి వస్తున్నందున... ఈ ఎఫ్‌పీఓ ద్వారా కూరగాయలు, పండ్లు కేవలం 2 శాతం కమీషన్ తీసుకోనున్నారు.
ఇదీ చూడండి:నీటిపారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష