తెలంగాణ

telangana

ETV Bharat / state

Niranjan Reddy: వ్యవసాయరంగంలో మహిళల పాత్ర కీలకం: నిరంజన్ రెడ్డి - మహిళా ప్రజాప్రతినిధులను సన్మానించిన మంత్రి

Niranjan Reddy: మహిళలు నాయకత్వం వహించే ఏ రంగమైనా ఉన్నతస్థానంలో ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రులు, మహిళా ప్రజాప్రతినిధులను శాసనసభలోని ఆయన ఛాంబర్​లో సన్మానించారు.

Niranjan Reddy
మహిళా ప్రజాప్రతినిధులతో మంత్రి నిరంజన్ రెడ్డి

By

Published : Mar 10, 2022, 6:24 PM IST

Niranjan Reddy: వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యం ఉన్న కుటుంబాలే రాణిస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శాసనసభలోని తన ఛాంబర్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, బానోతు హరిప్రియ, పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, కల్వకుంట్ల కవితలను మంత్రి సత్కరించారు.

సెల్ఫీ తీసుకుంటున్న ఎమ్మెల్సీ కవిత

ఈ సందర్భంగా మంత్రి వారందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కల్వకుంట్ల కవిత ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. మహిళ నాయకత్వం వహించే ఏ రంగమైనా సరే కచ్చితంగా ఉన్నత స్థానంలో ఉంటుందని తెలిపారు.

ఎమ్మెల్సీ కవితను సత్కరిస్తున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

సృష్టికి మూలం అమ్మ... ఆడబిడ్డలను గౌరవించుకోలేని మన సమాజం ఉన్నతంగా ఎదగలేదని చెప్పారు. భారత సంస్కృతిలో మహిళలకు విశిష్ట స్థానముందని... వారికి మన సమాజంలో ఇస్తున్న గౌరవం, స్వేచ్ఛ మరింత పెరగాలని సూచించారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆడబిడ్డలకు గౌరవించడంలో మరింత మార్పు రావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

మహిళా ప్రజాప్రతినిధులతో మంత్రి నిరంజన్ రెడ్డి

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details