తెలంగాణ

telangana

ETV Bharat / state

వనపర్తి జిల్లాకు రెండు అంబులెన్స్​లు అందించిన మంత్రి - gift a smile program

గిఫ్ట్ ఏ స్మైల్​ కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రెండు ఆంబులెన్స్​లను అందజేశారు. ఈ రెండు వాహనాలను వనపర్తి జిల్లాకే కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Minister Niranjan handing over the ambulances
ఆంబులెన్స్​లను అందజేసిన మంత్రి నిరంజన్

By

Published : Nov 16, 2020, 2:08 PM IST

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్​లో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వంతు సాయం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సొంత ఖర్చుతో రెండు ఆంబులెన్స్​లను అందజేశారు. హైదరాబాద్​లోని మంత్రుల నివాస కార్యాలయంంలో జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.

రెండు ఆంబులెన్స్​లను వనపర్తి జిల్లాకు కేటాయిస్తున్నట్లు మంత్రి నిరంజన్ స్పష్టం చేశారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్, ఇతర అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ వాహనాలు అన్నివర్గాల ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఇవి ఎంతగానో ఉపయోపగపడతాయని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details