రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం మహాధర్నా చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి (Minister Niranjan reddy latest news) పేర్కొన్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో చేపట్టిన మహాధర్నాలో (trs maha dharna at Indira park ) పాల్గొన్న మంత్రి.... రాష్ట్ర రైతుల కోసం..స్వయంగా సీఎం (cm kcr in maha dharna) ధర్నాలో కూర్చున్నారని వెల్లడించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించిందని తెలిపారు. రాష్ట్రంలో పల్లెలన్నీ పచ్చబడ్డాయని చెప్పారు. కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. కేంద్ర అస్పష్ట విధానాలతో తెలంగాణ రైతులకు అపార నష్టం కల్గుతుందని వివరించారు.
'రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసమే ఈ మహాధర్నా చేపట్టాం. రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నాలో కూర్చున్నారు. కేంద్రం విధానాలతో రైతులకు తీవ్ర నష్టం. కేంద్ర అస్పష్ట విధానాలతో తెలంగాణ రైతులకు అపార నష్టం వాటిల్లుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేసేలా రాష్ట్ర భాజపా నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. అన్నీ వ్యవస్థలు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయి. ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా కొనడంలేదు. సాగు గురించి భాజపా నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది.'
- నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
అన్ని వ్యవస్థలూ కేంద్రం చేతుల్లోనే
రాష్ట్ర ప్రభుత్వంపై నెపం వేసేలా రాష్ట్ర భాజపా నేతలు మాట్లాడుతున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు. అన్ని వ్యవస్థలూ కేంద్రం చేతుల్లోనే ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా కొనడంలేదని ఆరోపణలు చేశారు. వానాకాలంలో 63 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అద్భుత ప్రాజెక్టులు కట్టారని... బీడు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయని తెలిపారు.