Minister Niranjan reddy fires on bjp leaders: ఎనిమిదేళ్ల తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనత... 60ఏళ్ల క్రితం ఏర్పడిన గుజరాత్ అభివృద్ధిని పోల్చి చూస్తే... కేసీఆర్‌ను విమర్శించే వారికి తెరాస సర్కార్ గొప్పతనం అర్థమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏనాడు పోరాడని వారు ఇవాళ యాత్రలు చేస్తూ... తోచిన విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏదో రోజు తెలంగాణ సమాజం వారికి బుద్ధిచెప్పక తప్పదన్నారు. హైదరాబాద్ నుంచి జనాన్ని తీసుకువెళ్లి యాత్రలు చేస్తున్న వారు... రాష్ట్ర ప్రయోజనాల కోసం పాదయాత్ర చేస్తే బాగుంటుందని నిరంజన్‌రెడ్డి సూచించారు.
తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని గురుతర బాధ్యతగా భావిస్తున్నాం. గుజరాత్ ఏర్పడి 62 ఏళ్లైనా కరెంటు కష్టాలున్నాయి. 8 ఏళ్ల తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. తెలంగాణకు ఇతర ఏ రాష్ట్రాలు దరిదాపుల్లో కూడా లేవు. తెలంగాణ వ్యతిరేకులను సరైన సమయంలో నేలకేసి కొడతాం. తెలంగాణ ఏడేళ్ల సగటు ఆర్థిక వృద్ధి రేటు 11.7 శాతంగా ఉంది. భారతదేశం సగటు ఆర్థిక వృద్ధి రేటు 6 శాతమే.