సాగు పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆకాంక్షించారు. లేకపోతే భవిష్యత్తులో పెను సమస్యలు రావొచ్చన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కోసం రూ.20 వేల కోట్లు ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తు ఇచ్చిందని... కరోనా గడ్డు పరిస్థితుల్లో రైతులకు బాసటగా ఉండాలని సీఎం నిర్ణయించారని తెలిపారు.
వాణిజ్య పంటలు పెంచాలి
బహిరంగ మార్కెట్‌లో డిమాండ్, కనీస మద్దతు ధరలకు మించి ప్రోత్సాహం లభిస్తున్న దృష్ట్యా ప్రధాన వాణిజ్య పంట పత్తి 75 లక్షలు, కంది పంట 20 లక్షల ఎకరాలకు చేరాలని... పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు పోను మిగతా విస్తీర్ణంలో వరి సాగు చేసుకోవాలని మంత్రి సూచించారు.
గోదాముల సామర్థ్యం పెంపు
రాష్ట్రంలో మరో 45 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణం కోసం డీపీఆర్ తయారు చేస్తున్నామని ప్రకటించారు. అవి అందుబాటులోకి వస్తే కోటి 10 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాములు ఉంటాయన్నారు. ముందస్తుగా వచ్చే ధాన్యం కొనుగోలు కోసం నిజామాబాద్, జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించి రెండు మూడు రోజుల్లో కేంద్రాలు ప్రారంభిస్తానని మంత్రి వెల్లడించారు. సమావేశంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్ల కోసం బ్యాంకు పూచీకత్తు: మంత్రి నిరంజన్‌రెడ్డి ఇదీ చూడండి:రైతు కష్టానికి మంచి గిట్టుబాటు ధర దక్కాలి: నిరంజన్ రెడ్డి