పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారీతిన వెళ్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. నీరు వెళ్లకముందే ఏం చేయాలో తమకు తెలుసని చెప్పారు. చట్టబద్ధంగా ఏకపక్ష ప్రాజెక్టును అడ్డుకునే నైపుణ్యం తమకుందన్నారు. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
'ఆనాడు మీరు ఎందుకు అడ్డుకోలేదు' - Minister Niranjan Reddy comment Have you blocked that day
మీ నిర్వాకం వల్ల మేము ఇబ్బందులు పడాల్సి వస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆనాడు వైఎస్ తలపెట్టిన ప్రాజెక్టును ఎవరైనా అడ్డుకున్నారా అని కాంగ్రెస్ నాయకులపై ఆయన మండిపడ్డారు.
'ఆనాడు మీరు ఎందుకు అడ్డుకోలేదు'
పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం కేసీఆర్, తెరాసను నిందించే విపక్షాల నేతల విమర్శలను తాము పట్టించుకోబోమని వ్యాఖ్యానించారు. వైఎస్ హయాంలో ఈ నేతలెవరైనా నోరు విప్పారా అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. జలదోపిడీకి కావడి పట్టి చరిత్రహీనులుగా మిగిలిపోయారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇదీ చూడండి :వలస కూలీ దంపతులకు కరోనా పాజిటివ్!
Last Updated : May 14, 2020, 3:35 PM IST