Niranjan reddy comments on BJP And congress: ధాన్యం విషయంలో దిల్లీలోని కేంద్రంతో పోరాడకుండా... కాంగ్రెస్ నేతలు ఎర్రవల్లి పర్యటన దేనికంటూ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర మరిచి భాజపాకు సహకరిస్తోందని ఆరోపించారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు అమ్ముతున్న భాజపా సర్కార్‌ను కాంగ్రెస్ ఎందుకు నిలదీయడం లేదని నిరంజన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సీఎంపై దుష్ప్రచారం
Niranjan reddy about revanth reddy : రైసు మిల్లులతో ఒప్పందం చేసుకున్నవాళ్లు... ధాన్యాన్ని సొంతంగా అమ్ముకునే వాళ్లు వరి వేసుకోవచ్చునని సీఎం రైతులకు చెప్పారని మంత్రి గుర్తుచేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తూ... సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. కేంద్రంలో కత్తులు దూసుకుంటున్న కాంగ్రెస్, భాజపాలు రాష్ట్రంలో కలిసిపనిచేస్తున్నాయని ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ దిల్లీలో పోరాడాలని హితవు పలికారు.
'కాంగ్రెస్, భాజపా కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ త్వరలోనే భాజపాలో విలీనం కావడం ఖాయం. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ ఓట్లు భాజపా అభ్యర్థికి వేయించలేదా? అనేక కేంద్రప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అమ్ముతున్నది భాజపా కాదా? ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అమ్మి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నది ఎవరు? పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదు. ధాన్యం విషయంలో భాజపాను కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలదీస్తలేదు.
-నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి