తెలంగాణ

telangana

ETV Bharat / state

నివర్ పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: నిరంజన్​రెడ్డి - Minister Niranjan Reddy

దక్షిణ తెలంగాణ జిల్లాలపై నివర్ తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులు రెండు రోజుల పాటు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు.

Agriculture minister alert on nivar cyclone in ts
నివర్ పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : నిరంజన్​రెడ్డి

By

Published : Nov 25, 2020, 8:45 PM IST

నివర్​ తుఫాన్ పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​ రెడ్డి సూచించారు. దక్షిణ తెలంగాణ జిల్లాలపై తుఫాను అధిక ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు రెండురోజుల పాటు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని మంత్రి సూచించారు. ఇప్పటికే కేంద్రాలకు వచ్చిన పత్తి, వరిధాన్యాన్ని వీలైనంత త్వరగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎలాంచి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఉద్యోగులు కొనుగోలు కేంద్రాలను వదిలి వెళ్లరాదని స్పష్టం చేశారు. జిల్లా, ప్రాంతీయ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

ఇదీ చూడండి:తెరాస ఉద్యమ పార్టీగానే ప్రజల వద్దకు వెళ్లింది​: వినోద్​

ABOUT THE AUTHOR

...view details