రైల్వే ప్రైవేటీకరణపై పార్టీలకు అతీతంగా అందరం సమిష్టిగా పోరాడదామంటూ వివిధ కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. రైల్వే సంస్థను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశ వ్యతిరేక చర్యలను చేపట్టిందని రాష్ట్ర మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. రైల్వేను ప్రైవేటుపరం చేయడమంటే దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడమేనని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైల్వే ప్రైవేటీకరణకు అందరం కలిసి పోరాడదాం: నాయిని - రైల్వే ప్రైవేటీకరణకు అందరం కలిసి పోరాడదాం: నాయిని
రైల్వే సంస్థను ప్రైవేటుపరం చేయడానికి కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దేశ వ్యతిరేక చర్యలను చేపట్టిందని రాష్ట్ర మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోపించారు. ఏఐటీయూసీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయిని పాల్గొన్నారు.
రైల్వే ప్రైవేటీకరణకు అందరం కలిసి పోరాడదాం: నాయిని
ఏఐటీయూసీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన 'రైల్వేల ప్రైవేటీకరణ- ప్రజలపై భారం' అనే అంశంపై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ప్రధాని మోదీ అబద్ధాలు ప్రచారం చేసి గద్దెనెక్కారని.. భాజపా ప్రైవేటు వ్యక్తుల పార్టీగా నాయిని అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యవంతులైతే ఎంతటి వారినైనా గద్దె దించుతారని తెలిపారు. ఇందుకోసం మనందరం కలిసి ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన అవసరముందన్నారు.
ఇదీ చూడండి:సామాజిక మరుగుదొడ్లు వాడే వారిలో 62శాతం మందికి కరోనా