Minister Mallareddy Humanity : కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మూగ జీవి ప్రాణాలను కాపాడి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. విద్యుత్తు స్తంభంలో ఆవు తల ఇరుక్కుపోయి అవస్థలు పడుతున్న దృశ్యాన్ని గమనించిన మంత్రి.. కాన్వాయ్‌ను ఆపి మూగజీవిని కాపాడారు. జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్యక్రమానికి హాజరైన మంత్రి.. తిరిగి బోయిన్‌పల్లిలోని తన నివాసానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. మూగజీవాల పట్ల తనకున్న ప్రేమను మంత్రి మల్లారెడ్డి మరోసారి చాటుకున్నారని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
మూగజీవి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి మల్లారెడ్డి - మానవత్వాన్ని చాటుకున్న మంత్రి మల్లారెడ్డి
Minister Mallareddy Humanity : సాధారణంగా రోడ్డుపై ప్రమాదాలు జరిగి జంతువులు ఆపదలో ఉంటే వీఐపీలు చూసీచూడనట్టు తమకెందుకులే అని వెళ్లిపోతుంటారు. కానీ మంత్రి మల్లారెడ్డి ఇందుకు భిన్నంగా వ్యవహరించి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ కార్యక్రమానికి హాజరై వెళ్తుండగా మార్గమధ్యలో ఓ మూగజీవి ప్రాణాలు రక్షించుకోవడం కోసం అవస్థలు పడుతుండగా మంత్రి ఆ జీవిని కాపాడారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
Minister Mallareddy