నాచారం వద్ద నూతనంగా నిర్మిస్తున్న 400 పడగల ఈఎస్ఐ ఆస్పత్రిని ఏప్రిల్ చివరినాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ శాంతి శేఖర్ ఈఎస్ఐ సూపరింటెండెంట్ గీత ఇతర అధికారులతో కలిసి ఆస్పత్రిని సందర్శించారు.
'ఏప్రిల్ చివరినాటికి ఈఎస్ఐ ఆస్పత్రి అందుబాటులోకి' - హైదరాబాద్ తాజా వార్తలు
నాచారంలో నూతనంగా నిర్మిస్తున్న ఈఎస్ఐ ఆస్పత్రిని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. నూతన భవనాన్ని ఏప్రిల్ చివరినాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
'ఏప్రిల్ చివరినాటికి ఈఎస్ఐ ఆస్పత్రి అందుబాటులోకి'
నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రిలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కొన్ని కారణాల వల్ల నిర్మాణం ఆలస్యమైందని త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. నూతన భవనం అందుబాటులోకి వస్తే రోగుల కష్టాలు తీరుతాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ గీత ఆశాభావం వ్యక్తం చేశారు.