సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కలున్న పది గుడిసెలు చూస్తుండగానే అగ్నికి ఆహుతయ్యాయి.
అగ్నిప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి మల్లారెడ్డి - minister mallareddy latest news
సికింద్రాబాద్ బాపూజీనగర్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులను మంత్రి మల్లారెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలకు లక్షరూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి ప్రకటించారు.
అగ్నిప్రమాద బాధితులకు మంత్రి మల్లారెడ్డి పరామర్శ
విషయం తెలిసిన వెంటనే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఘటనా స్థలికి వెళ్లారు. బాధిత కుటుంబాలను పరామర్శించి... ఒక్కో కుటుంబానికి లక్షరూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇదీ చూడండి: గూడు కాలింది... గోడు మిగిలింది