తెలంగాణ

telangana

మరోసారి నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి.. సభలో తనదైన శైలిలో ప్రసంగం

Minister Mallareddy: శాసనసభలో ఆర్థిక పద్దుపై వాడీవేడీ చర్చ తర్వాత కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నవ్వులు పూయించారు. తన మార్కు సంభాషణలతో రాష్ట్రంలో అభివృద్ధిని వివరిస్తూనే...ప్రతిపక్షాలకు చురకలంటించారు. భాజపా, కాంగ్రెస్‌ పాలనపై ఆరోపణలు సంధించారు. కేసీఆర్‌, కేటీఆర్‌లను మరోసారి ఆకాశానికెత్తిన మల్లారెడ్డి.. చల్లని చంద్రుడు, తారకరాముడు ఉండగా ఇంకేం కావాలంటూ వ్యాఖ్యానించారు.

By

Published : Mar 13, 2022, 7:16 AM IST

Published : Mar 13, 2022, 7:16 AM IST

మరోసారి నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి.. సభలో తనదైన శైలిలో ప్రసంగం
మరోసారి నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి.. సభలో తనదైన శైలిలో ప్రసంగం

మరోసారి నవ్వులు పూయించిన మంత్రి మల్లారెడ్డి.. సభలో తనదైన శైలిలో ప్రసంగం

Minister Mallareddy: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మల్లారెడ్డి మరోసారి తన మాటలతో సభను నవ్వులతో నింపారు. మైక్‌ పట్టుకోగానే సభంతా సల్లబడింది.. సప్పగయ్యిదంటూ చతుర్లు సంధించారు. కేసీఆర్‌ అపర భగీరథుడంటూ పొగిడిన మంత్రి.. మూడో కూటమికి అడుగుపడిందని భాజపా నేతలపై తనదైన శైలిలో పంచులు విసిరారు.

భట్టి రాష్ట్రమంతా తిరగాలి..

భవన నిర్మాణ కార్మికులకు త్వరలోనే సబ్సిడీపై లక్ష మోటారు సైకిళ్లు ఇప్పిస్తామని వెల్లడించారు. తాము ట్రెండ్‌ ఫాలో అవ్వమని.. ట్రెండ్‌ సెట్‌ చేస్తామంటూ సినిమా డైలాగులు వదిలారు. కాంగ్రెస్, భాజపా అన్నదమ్ముల్కెక్క అని మల్లారెడ్డి అన్నారు. జవహర్‌నగర్‌లో చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేస్తున్న తీరుపై వివరిస్తూ.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్రమంతా తిరగాలని చురకలంటించారు.

సభ నవ్వులమయం

కేటీఆర్‌ది టీఎస్​ ఐపాస్.. నాది ఫ్యాక్టరీ ఐ పాస్ అని మల్లారెడ్డి చెప్పారు. కేటీఆర్, హరీష్‌లనే ప్రశ్నలు అడగడం కాదు.. తనని కూడా అడగాలని.. కార్మికశాఖను తక్కువ చేయొద్దంటూ అందరినీ నవ్వించారు. ప్రతిపక్ష నేతలకు మల్లారెడ్డి అన్ని ఇస్తామంటున్నారు కనుక అడుగుతామని భట్టి విక్రమార్క అనడంతో సభ నవ్వులమయం అయ్యింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details