తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన మంత్రి మల్లారెడ్డి - sanitization programme

మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు... ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా... మంత్రి మల్లారెడ్డి తన నివాసంలోని పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

minister-mallareddy-participated-10-minutes-at-10-am-every-sunday-at-hyderabad
ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన మంత్రి మల్లారెడ్డి

By

Published : Jun 7, 2020, 12:47 PM IST

హైదరాబాద్​ బోయిన్​పల్లిలోని తన నివాసంలో మంత్రి మల్లారెడ్డి స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి కేటీఆర్​ పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10గంటలకు పది నిమిషాలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా నివారించుటకు ఇంటి పరిసర ప్రాంతాలను స్వయంగా శుభ్రపరిచారు.

అంటువ్యాధులకు కారణం అవుతున్న దోమల నివారణకు, అవి వృద్ధి చెందకుండా ఉండడానికి విధిగా మన ఇంట్లో, మన ఇంటి పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న నీటిని తొలగించాలని మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులకు, నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. కావున ప్రతి పౌరుడు ఈరోజు నుంచే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పదినిమిషాల పాటు విధిగా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించాలని మంత్రి సూచించారు.


ఇవీ చూడండి: పాదచారులు భద్రంగా వెళ్లండి!

ABOUT THE AUTHOR

...view details