కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవడం అభినందనీయమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్ పుర కమ్యూనిటీ హాల్లో కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది పాల్గొని రక్తదానం చేశారు.
Minister mallareddy: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి - రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బండ ప్రకాష్
సికింద్రాబాద్లోని రసూల్పుర కమ్యూనిటీ హాల్లో కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ధ్రువ పత్రాలను అందజేశారు.
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
రక్తదాతలకు మంత్రి మల్లారెడ్డి ధ్రువ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, మల్కాజిగిరి పార్లమెంట్ తెరాస పార్టీ ఇన్ఛార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి, కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, పిట్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ