ఈ సంక్రాంతి రాష్ట్ర ప్రజల ఇళ్లలో ఆయురారోగ్యాలు, సుఖ శాంతులు తీసుకురావాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
'సంక్రాంతి అంటేనే... పతంగుల పండుగ' - కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
!['సంక్రాంతి అంటేనే... పతంగుల పండుగ' minister-mallareddy-distributed-kites-to-kida-in-secundrabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5695097-thumbnail-3x2-a.jpg)
'సంక్రాంతి అంటేనే... పతంగుల పండుగ'
'సంక్రాంతి అంటేనే... పతంగుల పండుగ'
సికింద్రాబాద్ బోయిన్పల్లిలో టింకూగౌడ్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు పతంగులు పంపిణీ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినాన బోయిన్పల్లిలోని పేద పిల్లలకు గాలి పటాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ అని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తెరాసకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు.