మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండల కేంద్రంలో 48 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి కొనియాడారు. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా సాయం చేస్తూ... సీఎం కేసీఆర్ పెద్దన్నలాగా మారారని తెలిపారు. మేడ్చల్ నియోజకవర్గంలో సుమారు 204 మందికి కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేయడం జరిగిందని వివరించారు.
మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్, ఘట్ కేసర్, బోడుప్పల్లలో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. కరోనా బాధితులకు మల్లారెడ్డి ఆసుపత్రి, నాచారం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందజేస్తామన్నారు.