తెలంగాణ

telangana

ETV Bharat / state

MALLAREDDY: ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మల్లారెడ్డి - telangana varthalu

రేవంత్‌రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని మంత్రి డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమైతే రాజీనామాకు సిద్ధమని.. ఆరోపణలు నిరూపించకపోతే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని ఆయన అన్నారు.

MALLAREDDY: ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మల్లారెడ్డి
MALLAREDDY: ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మల్లారెడ్డి

By

Published : Aug 26, 2021, 4:10 PM IST

Updated : Aug 26, 2021, 4:19 PM IST

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమైతే రాజీనామాకు సిద్ధమని.. లేదంటే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. టీపీసీసీ అధ్యక్షుడైనంత మాత్రానా నోటికొచ్చింది మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

రాజకీయాల్లో ఉన్నప్పుడు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని.. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కష్టపడి జీవితంలో పైకి వచ్చిన తమపై బురద చల్లడం సరికాదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్​ను కూడా నోటికి వచ్చినట్లు మాట్లాడడం సహేతుకం కాదన్నారు,.

ఒక్కటంటే.. వంద అంటాం..

ఒక ఎంపీ అయి ఉండి సీఎంను, మంత్రి కేటీఆర్​ను, మంత్రినైన నన్ను ఆ మాదిరిగా తిడితే మంచిదేనా. ఒక్కటంటే మేము ఊకుంటామా.. పది అంటం, నూరు అంటం.. విడిచేదే లేదు. ప్రతిసారి సీఎం కేసీఆర్​ను, మంత్రి కేటీఆర్​ను తిడతాడా.. వాళ్లేమన్నా చెడు పని చేస్తున్నరా?. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తున్నరు వాళ్లు. తాగునీరు, సాగునీరు, కల్యాణలక్ష్మితో పాటు ఎన్నో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో లేని పథకాలు కూడా ఇస్తున్నరు. దళితబంధు ఇస్తే ఆయనకు ఎందుకు కోపం వస్తోంది. రాజీనామా అయితే చేయి.. సవాల్​కు నేను తయారై కూసున్నా. -మల్లారెడ్డి, కార్మిక శాఖ మంత్రి

MALLAREDDY: ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: మల్లారెడ్డి

ఇదీ చదవండి:MALLA REDDY: మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్​ శ్రేణుల అరెస్ట్​

Last Updated : Aug 26, 2021, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details