ప్రతి ఆదివారం... ఉదయం పది గంటలకు పది నిముషాల పాటు ఇళ్లలో నిలిచి ఉన్న నీరును శుభ్రం చేయాలని... అలా చేస్తే వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు వృద్ధి చెందవని కేటీఆర్ సూచించారు. ఈ సూచనల మేరకు మంత్రి మల్లారెడ్డి ఈ రోజు తన స్వగృహంలోని పరిసరాలను శుభ్రం చేశారు. డెంగ్యూ, చికెన్ గున్యా, కలరా వంటి వ్యాధులు రాకుండా... దోమల నివారణకై అందరూ ఈ పనుల చేయాలని మంత్రి సూచించారు. ఇంటి పరిసరాల్లోని పిచ్చిమొక్కలను తీసి, గుబురుగా పెరిగిన ఇంటి ఆవరణలోని మొక్కలను పెంచుకోవాలని సూచించారు.
'ప్రతి ఆదివారం... ఉదయం పది గంటలకు మరిచిపోకండి' - శుభ్రత పరిశుభ్రత
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంత్రి మల్లారెడ్డి తన ఇంటి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరు ఇంట్లో నిలిచి ఉన్న నీరు తొలగించి శుభ్రపరచుకోవాలని మల్లారెడ్డి సూచించారు.

'ప్రతి ఆదివారం... ఉదయం పది గంటలకు మరిచిపోకండి'