దాదాపు పది రోజుల్లో పది లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్కి వ్యాక్సిన్ వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డిలు అన్నారు. నాచారంలోని జాన్సన్ గ్రామర్ పాఠశాలలో ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మాక్సి క్యాబ్ డ్రైవర్లకు ప్రత్యేక టీకా కార్యక్రమం నిర్వహించారు. ప్రజలను గమ్య స్థానాలకు చేర్చడంలో ట్యాక్సీ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్ కీలక పాత్ర పోషిస్తున్నందున... రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం తెలిపారు.
Ministers at vaccine center: వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు
హైదరాబాద్ నాచారంలోని జాన్సన్ గ్రామర్ పాఠశాలలో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి పరిశీలించారు. టీకాలు ఎంత మందికి ఇచ్చారు వంటి విషయాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన మంత్రులు
ఇచ్చిన గడువు కంటే ముందుగానే సూపర్ స్ప్రెడర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని వైద్యాధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది అని మంత్రులు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, రవాణా శాఖ అధికారులు, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.