తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారులతో మంత్రి మల్లారెడ్డి హోలీ సంబురాలు - minister malla reddy comments

రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబురాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి తన ఇంటి వద్ద చిన్నారులతో కలిసి హోలీ జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకొని చిన్నారులు సందడి చేశారు.

minister malla reddy, holi celebrations
మంత్రి మల్లారెడ్డి

By

Published : Mar 29, 2021, 11:38 AM IST

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బోయిన్​పల్లిలోని తన నివాసం వద్ద హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులతో కలిసి ఆయన హోలీ సంబురాలు జరుపుకున్నారు. చిన్నా.. పెద్ద భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సంబురాల్లో పాల్గొన్నారు.

చిన్నారులు రంగుల్లో తేలియాడుతూ... సందడి చేశారు. కరోనా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని కొద్దిసేపు మాత్రమే మల్లారెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. వారితో ఓ ఫోటో దిగి ఇంట్లోకి వెళ్లిపోయారు. చిన్నారులకు, రాష్ట్ర ప్రజలకు కరోనా విజృంభిస్తున్న వేళ ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details