తెలంగాణ

telangana

పాస్టర్లకు నిత్యావసరాలను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి

By

Published : May 28, 2020, 3:53 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యల వల్ల కొవిడ్​-19 పాజిటివ్​ కేసుల సంఖ్య కొంతమేర తగ్గిందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Hyderabad latest news
Hyderabad latest news

సికింద్రాబాద్​ క్లాసిక్ గార్డెన్​లో పి.జె.ఎస్ పౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డి హాజరై... పేద క్రిస్టియన్లు,పాస్టర్లకు నిత్యావసర సరకులను అందజేశారు.

లాక్​డౌన్​ నేపథ్యంలో పాస్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారికి చేయూత అందించే విధంగా కృషి చేస్తానని మంత్రి మల్లారెడ్డి హామీ ఇచ్చారు. కరోనా నివారణ కోసం ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పి.జె.ఎస్ పౌండేషన్ ఛైర్మన్ పాల్​తోపాటు పలువురు తెరాస నేతలు పాల్గొన్నారు. ​

ABOUT THE AUTHOR

...view details