సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లిలోని పార్టీ కార్యాలయంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కార్మిక జెండాను ఆవిష్కరించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేశారు.
బోయిన్‌పల్లిలో ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం - తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోయిన్‌పల్లిలోని పార్టీ కార్యాలయంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జెండాను ఆవిష్కరించారు.
![బోయిన్‌పల్లిలో ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం minister-malla-reddy-flag-hoisting-at-trs-party-office-bowenpally-secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6956326-thumbnail-3x2-malla-reddy.jpg)
బోయిన్‌పల్లిలో ఘనంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం
ముఖ్యమంత్రి కేసీఆర్ 13 ఏళ్లు ఆహర్నిశలు ఎన్నో పోరాటాలు చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి చరిత్రలో నిలిచారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళుతోందని... ఆరే ఏళ్లలోనే దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సుజల దృశ్యం.. సీఎం కేసీఆర్‌తో సాక్షాత్కారం: కేటీఆర్