వలస కూలీలను తరలించడంతో కేంద్ర పాత్ర సున్నా అని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 75 ప్రత్యేక శ్రామిక్ రైళ్లలో అనేక మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించిందని ఆయన తెలిపారు.
ఆ విషయంలో కేంద్రం బాధ్యత సున్నా: కేటీఆర్ - కేటీఆర్ ట్విట్టర్ ద్వారా ప్రకటన
వలస కార్మికుల తరలింపు విషయంలో కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వలసకూలీలను తరలించడంలో కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రం రూ.6 కోట్లు రైల్వేశాఖకు చెల్లించి 75 శ్రామిక్ ప్రత్యేక రైళ్లలో కూలీలను తరలించిందని ట్వీట్ చేశారు.
![ఆ విషయంలో కేంద్రం బాధ్యత సున్నా: కేటీఆర్ Minister KTR's outrage over the way of the Center in shramik rails](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7268150-226-7268150-1589909930438.jpg)
కేంద్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందన్న మంత్రి కేటీఆర్
ఇందుకోసం రైల్వే శాఖకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6 కోట్లు చెల్లించిందని కేటీఆర్ పేర్కొన్నారు. కూలీలను పూర్తి ఉచితంగా వారి గమ్మస్థానాలకు చేరుస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి :వరి ధాన్యం కొనుగోలులో జాప్యంతో రైతు ఆత్మహత్యాయత్నం