రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు నిధులతోపాటు.. సిరిసిల్లకు మెగా పవర్ లూం క్లస్టర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీకి కేటీఆర్ లేఖ రాశారు.
టెక్స్‌టైల్ పార్కులో మౌలిక వసతుల పనుల కోసం తక్షణమే 300కోట్ల రూపాయలు ఇవ్వాలని విన్నవించారు. సిరిసిల్లా మెగా పవర్ లూం క్లస్టర్ ప్రాజెక్టు వ్యయమైన 993.65కోట్లలో 49.84కోట్లు మంజూరు చేయాలని కోరారు. 756కోట్లతో పవర్ లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వివరించారు.