తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీగా ఎంపికైన వారికి కేటీఆర్​ అభినందనలు - దయానంద్ తాజావార్తలు

ఎమ్మెల్సీగా ఎంపికైన ముగ్గురికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గోరెటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్​ చట్టసభలకు వెళ్లడం శుభపరిణామం అన్నారు.

minister ktr wishes to governor quota mlc's in hyderabad
ఎమ్మెల్సీగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్​

By

Published : Nov 15, 2020, 11:21 AM IST

Updated : Nov 15, 2020, 11:36 AM IST

గవర్నర్​ కోటా కింద సీఎం కేసీఆర్​ గోరెటి వెంకన్న, బస్వరాజు సారయ్య, దయానంద్​ నామినేట్​ చేశారు. ఈ ముగ్గురికి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తన పాటలతో ప్రజలను చైతన్యపరిచిన పాలమూరు మట్టి పరిమళం... సాహితీ దిగ్గజంగా గోరెటి వెంకన్నను ఆయన అభివర్ణించారు.

రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందున్న తెలంగాణ కళాకారులకు దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన రజక సామాజిక వర్గం నుంచి ప్రజానేతగా బస్వరాజు సారయ్య ఎదిగారని చెప్పారు. సంఘసేవకులు, ఆర్యవైశ్య ప్రతినిధి భోగారపు దయానంద్​ను ఎమ్మెల్సీగా ఎంపిక చేసి... చట్టసభల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:దోమలగూడలో పంచతత్వ పార్కుని ప్రారంభించనున్న కేటీఆర్​

Last Updated : Nov 15, 2020, 11:36 AM IST

ABOUT THE AUTHOR

...view details